Sukesh Chandrasekhar | రోజురోజుకూ ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సుఖేశ్ మీద పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసు కూడా అతడి మీద బుక్ అయింది.
ఓ వ్యాపారవేత్త భార్య నుంచి రూ.200 కోట్లు కాజేసి.. ఆ డబ్బులతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సుఖేశ్ వల వేసినట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. అతడి వలలో నోరా ఫతేహీ, జాక్వెలిన్ ఫెర్నాండెస్ పడిపోయారు. సుఖేశ్ వాళ్లకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చినట్టు తెలిసింది. కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టు స్పష్టం అయింది.
అయితే.. సుఖేశ్ లిస్టులో ఈ ఇద్దరు హీరోయిన్లే ఉన్నారని ఇప్పటి దాకా అనుకున్నాం. కానీ.. సుఖేశ్ లిస్టు పెద్దదే ఉంది. బాలీవుడ్ బ్యూటీలు శ్రద్దా కపూర్, శిల్పా శెట్టి కూడా మనోడి వలలో చిక్కుకున్నారు.
ఈ విషయాన్ని సుఖేశ్.. ఈడీ ఎదుట ఒప్పుకున్నాడు. 2015లో శ్రద్ధా కపూర్‌కు ఓ కేసులో సాయం చేశాడట. అలాగే.. రాజ్ కుంద్రా జైలులో ఉన్నప్పుడు అతడి బెయిల్ విషయమై శిల్పా శెట్టితో కూడా మాట్లాడాడట.
జాక్వెలిన్‌తో రూ.500 కోట్లతో సూపర్ హీరో మూవీని తను ప్లాన్ చేసినట్టు ఈడీ ఎదుట సుఖేశ్ ఇదివరకే ఒప్పుకున్నాడు. అలాగే.. బాలీవుడ్ యాక్టర్ హర్మాన్ ప్రొడ్యూస్ చేస్తున్న కెప్టెన్ ఇండియా మూవీలో సహ నిర్మాతగా వ్యవహరించేందుకు కూడా తాను ప్రయత్నాలు చేసినట్టు సుఖేశ్ ఈడీకి తెలియజేశాడు.
ఇప్పటికే సుఖేశ్‌తో సంబంధం ఉన్న జాక్వెలిన్, నోరా ఫతేహీలను ఈడీ విచారించింది. సుఖేశ్ నుంచి తమకు లగ్జరీ గిఫ్ట్‌లు వచ్చినట్టు కూడా వాళ్లు ఈడీ ముందు ఒప్పుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bheemla Nayak | సంక్రాంతి బరిలో నుంచి భీమ్లానాయక్ ఔట్!
పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. ఊ అంటావా పాటపై సమంత షాకింగ్ పోస్ట్
ముంబైలో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ.. బారికేడ్లు బద్దలు.. ఆశ్చర్యపోయిన ముంబైకర్స్
భీమ్లానాయక్ నిర్మాతపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రశంసలు