Janaka Aithe Ganaka | కలర్‌ఫొటో సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ సుహాస్ (Suhas). ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇటీవలే ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) సినిమా చేశాడని తెలిసిందే. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మించారు. సంగీత్, వేన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఈ చిత్రం నవంబర్ 8న ఆహాలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ప్రీమియర్ డేట్ కంటే ఒక రోజు ముందే ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లు యాక్సెస్ చేసుకునే అవకాశముంది.
ఆ ఒక్క డెసిషన్ నా లైఫ్‌ను మార్చేసింది. నేను ఒకవేళ తండ్రిని అయితే నా వైఫ్‌ను సిటీలో ఉన్న బెస్ట్ ఆస్పత్రిలో చూపించాలి. నా పిల్లలను బెస్ట్ స్కూల్లో చదివించాలి, బెస్ట్ కాలేజిలో చదివించాలి. వాళ్లకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లలను కనకూడదు.. అంటూ టీజర్, ట్రైలర్లో సాగుతున్న డైలాగ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు కనెక్ట్ అవుతూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రియాక్షన్ రాబట్టుకుంటునేది చూడాలి.
Prepare yourself for a rollercoaster of emotions and non-stop entertainment 💯💥
#janakaaitheganaka premieres on 8 th November only on #aha #janakaaitheganakaonaha@ActorSuhas @sangeerthanaluv @KalyanKodati@kk_lyricist @HR_3555 #HanshithaReddy@DilRajuProdctns pic.twitter.com/bkhzNbPXL3
— ahavideoin (@ahavideoIN) October 30, 2024
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..