టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యాక్టర్ కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రముఖ నటుడు హర్షవర్ధన్ డైరెక్షన్ లో సుధీర్ బాబు ఈ సినిమా చేస్తుండటం విశేషం. సీనియర్ నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
హర్షవర్ధన్ లాంటి టాలెంటెడ్ వ్యక్తి డైరెక్షన్లో ప్రొడక్షన్ నంబర్ 5గా వస్తున్న ఈ చిత్రం నాకు, నా టీంకు ఛాలెంజింగ్ జర్నీ కాబోతుందని సుధీర్ బాబు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. నేనిప్పటి వరకు ప్రయత్నించని సరికొత్త సినిమా అంటూ అందరికీ హింట్ ఇచ్చాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై