సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాల్లో అదిరిపోయే బ్లాక్‌బస్టర్స్ ఏవీ లేవు కానీ సమ్మోహనం వంటి అందమైన సినిమాలు మాత్రం ఉన్నాయి. దీంతో సుధీర్ బాబుకు టాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చింది. ఈయన మార్కెట్ కూడా దాదాపు 8 కోట్ల వరకు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈయన నటిస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు కూడా అదిరిపోయే మార్కెట్ జరుగుతుంది. గత సినిమాలకు సంబంధం లేకుండా దుమ్ముదులిపేస్తుంది ఈ సినిమా.
సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దేశవ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను వీలైనంత వరకు భారీగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్. ఈ మధ్యే విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన జాతి రత్నాలు సినిమాను కూడా ఈయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనుంది చిత్ర యూనిట్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సిన్మా చూస్తే పాగల్ అయిపోతారు.. పాగల్ మూవీ పబ్లిక్ టాక్
‘మా’లో హీట్ పెంచుతున్న ఎన్నికల లొల్లి
మా సభ్యులకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసిన నరేష్
కలలోనే నన్ను అరెస్ట్ చేయగలరు.. బిగ్ బాస్ భామ సంచలన కామెంట్స్