‘మా’లో హీట్ పెంచుతున్న ఎన్నికల లొల్లి
MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఎన్నికల లొల్లి రోజురోజుకు హీట్ పెంచుతున్నది. రోజూ అసోసియేషన్ సభ్యుల వాదోపవాదాలతో 'మా' ఛాంబర్ దద్దరిల్లుతుంది.

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఎన్నికల లొల్లి రోజురోజుకు హీట్ పెంచుతున్నది. రోజూ అసోసియేషన్ సభ్యుల వాదోపవాదాలతో ‘మా’ ఛాంబర్ దద్దరిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ‘మా’ అసోసియేషన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఆ విలేకరుల సమావేశం ఎన్ని గంటలకు జరుగనుంది అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇదిలావుంటే ‘మా’ లోని కొందరు సభ్యులు ఈ వివాదానికి సంబంధించి నిరసనగా దాసరి నారాయణరావు విగ్రహానికి మెమొరాండం ఇవ్వనున్నారని, నరేష్ వర్గం కృష్ణంరాజును కలిసి వినతి పత్రం సమర్పించనుందని కూడా ప్రచారం జరుగుతున్నది.
కాగా, ‘మా’ లో ప్రస్తుత కార్యవర్గం గడువు సెప్టెంబర్ వరకు ఉన్నది. అయితే ‘మా’ లో వర్గపోరు కారణంగా ఎన్నికలు వెంటనే నిర్వహించాలనే డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్నది. ఇంకో విషయం ఏమిటంటే ‘మా’ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ అధ్యక్ష పదవికి ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. ఆ ఐదుగురిలో ఒకరైన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ 27 మందితో ప్యానల్‌ను ప్రకటించారు. ఇక మంచు విష్ణు, నటి జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నసింహారావు ఫ్యానల్స్ ప్రకటించకపోయినా తాము కూడా ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

