మా సభ్యులకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసిన నరేష్

ప్రస్తుత మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ శుక్రవారం రాత్రి తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇచ్చారు. తాను అధ్యక్షుడు అయినప్పటి నుండి తనకు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా సపోర్ట్ అందించినందుకు మా సభ్యులకి కృతజ్ఞతగా పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కమెడియన్ అలీ, నటులు శివ బాలాజీ, పృథ్వీ, సంపూర్ణేష్, కరాటే కళ్యాణి, సీనియర్ నటుడు రాజ్ కుమార్ సహా..100 మందికి పైగా హాజరయ్యారు.
మరి కొద్ది రోజులలో మా ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో నరేష్ పార్టీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల నరేష్‌పై హేమ దారుణమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నరేష్ అధ్యక్షుడిగా కొనసాగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని , ఇంతవరకు మా అసోసియేషన్ రూపాయి సంపాదించకపోగా ఉన్న 5 కోట్ల నిధులను నరేష్ 2 కోట్లకు తీసుకొచ్చారని 3కోట్లు వృధాగా ఖర్చు చేశారంటూ వాయిస్ రికార్డులో హేమ తెలిపారు దీనిపై స్పందించిన నరేష్.. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని , ఆమెపై క్రమోశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.



Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actor naresh ali
- MAA
- naresh
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

