టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. గత ఏడాది వి చిత్రంతో ప్రేక్షకులతో పలకరించిన ఈయన ప్రస్తుతం రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే సుధీర్ బాబు ..సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు అనే సంగతి మనందరికి తెలిసిందే. 2006లో కృష్ణ కూతురు ప్రియదర్శినిని వివాహం చేసుకోగా, వీరికి చరిత్ మానస్ – దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చరిత్ మానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఆరంగేట్రం చేసిన విషయం విదితమే.
సుధీర్ బాబు ఫ్యామిలీని చాలా తక్కువ మంది చూసి ఉంటారు. తాజాగా తన సోషల్ మీడియా ద్వారా క్యూట్ ఫ్యామిలీని పరిచయం చేశాడు. అందరు ట్రెడిషన్ దుస్తులలో కలిసి ఫొటోలు దిగగా, వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో వారి పెట్ డాగ్ కూడా కనిపిస్తుండగా, అది స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు . అలానే ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తున్నాడు.మరోవైపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించనున్నారు.
Smiling together is basically having a great conversation, without actually having one ☺️❤
— Sudheer Babu (@isudheerbabu) May 20, 2021
Outfit : @raamzofficial
Designer : Chandrika Raamz
Photography : Avinash pic.twitter.com/QwrsOMmLsp