Rajkumar Hirani | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న అతికొద్ది బాలీవుడ్ దర్శకుల్లో రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) ఒకరు. ఇండస్ట్రీకి తిరుగులేని బ్లాక్ బస్టర్స్ అందించిన ఈ స్టార్ డైరెక్టర్ చివరగా షారుక్ ఖాన్ డుంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ కిడ్స్ ఎంట్రీ కొత్తేమి కాదని తెలిసిందే. ఇప్పటికే చాలా మంది స్టార్ కిడ్స్ తమను తాము ప్రూవ్ చేసుకున్నారు.
తాజాగా రాజ్ కుమార్ హిరానీ తన కొడుకు వీర్ (Vir) ను గ్రాండ్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. త్వరలో హిరానీ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాడు. లండన్ ఫిలిం స్కూల్లో నటనలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న వీర్ తన తండ్రి హిరానీ డైరెక్షన్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటంతో డెబ్యూ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుందట.
సోషల్ డ్రామా నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. రాజ్‌కుమార్ హిరానీ మరోవైపు సంజయ్ దత్తో మున్నాభాయ్ సిరీస్‌ను కూడా షురూ చేయబోతున్నాడట. ఇంకేంటి మరి హిరానీ నుంచి మళ్లీ క్రేజీ సినిమాలు ఉండబోతున్నాయన్నమాట.
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే