Thaman BGM in Radhe shyam | ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఒకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ బయటికి వచ్చింది.
రాధే శ్యామ్ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆర్ఆర్ అందించబోతున్నారు. ఈయనే సినిమాకు రీ రికార్డింగ్ అందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేమను వెతుక్కుంటూ హీరో చేసే ప్రయాణమే ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆల్ ఇండియా రికార్డులను బద్ధలుకొడుతుంది. అత్యద్భుతమైన విజువల్స్ అందులో కనిపిస్తున్నాయి. ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు.
Young music maestro @MusicThaman to score the BGM of #RadheShyam for South Languages!#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs pic.twitter.com/BdFs1vuFQ6
— BA Raju's Team (@baraju_SuperHit) December 26, 2021
తమన్ ఆర్ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణ. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ పరిస్థితేంటి.. ముంబైలో గడ్డు పరిస్థితులు..!
RRR and Radhe shyam | ఆ విషయంలో రాజమౌళిని బీట్ చేసిన ప్రభాస్..
Naveen Polishetty | రాధే శ్యామ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత తీసుకున్నాడో తెలుసా..?
Radhe Shyam Satellite rights | హాట్ టాపిక్‌గా రాధేశ్యామ్ శాటిలైట్ రైట్స్
ట్రిపుల్ ఆర్తో పాటు ఆ సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్న రాజమౌళి..
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?