బాలీవుడ్ (Bollywood) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) డైరెక్షన్లో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది టీం. కాగా బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్ ను రాజమౌళి విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ చెన్నైలో ల్యాండింగ్ అయింది జక్కన్న అండ్ బ్రహ్మాస్త్ర టీం.
ఈవెంట్లో రాజమౌళి ఆసక్తికర విషయమొకటి చెప్పగా..ఆ న్యూస్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మీరు ఏ తమిళ స్టార్ హీరోను డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతారని జక్కన్నను ప్రశ్నించగా…తనకు ఏదో ఒక రోజు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయాలనుందని చెప్పాడు. కింగ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకునే రజినీకాంత్ అన్నీ కుదిరి రాజమౌళితో కలిసి సినిమా చేస్తే మాత్రం బిగ్ స్క్రీన్‌పై అందరికీ థ్రిల్‌ను అందించడం పక్కా అని చెప్పొచ్చు.
బ్రహ్మాస్త్రలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ (Alia bhatt), అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : Hari Hara Veera Mallu | నిర్మాత యాక్టివ్..పవన్ సైలెన్స్..సినిమా పూర్తయ్యేనా..?
Read Also : Odela Railway Station Trailer | హత్యాచారం స్టోరీతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ ట్రైలర్
Read Also : Crazy News | క్రేజీ టాక్..ప్రభాస్-మారుతి సినిమా లాంఛ్ రేపే..?