ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా విడుదల నేపథ్యంలో తీరిక లేకుండా ప్రమోషన్స్ తో బిజీగా మారిపోయాడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నాడు. వచ్చే శుక్రవారమే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఓ సెన్సేషనల్ న్యూస్ ఒకటి ఫిలినగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి నెక్ట్స్ సినిమా పుష్పరాజ్‌తో చేయబోతున్నాడట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో జక్కన్న సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. జక్కన్న, బన్నీ ఇప్పటికే పలుసార్లు సమావేశమై సినిమా గురించి చర్చించారట. పాపులర్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్ బాబుతో చేయబోతున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు జక్కన్న.
ఈ మూవీ పూర్తవగానే అల్లు అర్జున్ సినిమాను ట్రాక్ ఎక్కించనున్నట్టు ఇన్సైడ్ టాక్. మరి ఈ క్రేజీ న్యూస్ పై రాబోయే రోజుల్లో ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి. ఇటీవలే సుకుమార్ డైరెక్షన్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇపుడు పుష్ప 2పై ఫోకస్ పెట్టబోతున్నాడు బన్నీ.