Jr NTR imitates Jakkanna | రాజమౌళిని ఇమిటేట్ చేసిన ఎన్టీఆర్..వీడియో వైరల్
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో జక్కన్న, తారక్, చరణ్ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నారు.
మూవీ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో జక్కన్న, తారక్, చరణ్ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తారక్, చరణ్, జక్కన్నతో డైరెక్టర్ అనిల్‌రావిపూడి ఫన్ చిట్‌చాట్ చేశాడు. ట్రిపుల్ ఆర్తో క్వాడ్రబుల్ ఆర్ అంటూ అనిల్ రావిపూడి ఓ ఫన్ టాస్క్ ఇచ్చాడు.
ఇప్పటివరకు ఎవరకి తెలియని సీక్రెట్ చెప్పాలని అడిగాడు. అది చెప్పకపోతే నాటు నాటు సాంగ్ స్టెప్పులేయాలని అడిగాడు అనిల్. అడిగినట్టుగానే నాటు నాటు స్టెప్పులేశాడు జక్కన్న. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్స్ చెప్పాలని ఎన్టీఆర్ ను అడిగాడు. అది ఫెయిలవడంతో రాజమౌళిని ఇమిటేట్ చేయాలని తారక్‌ను అడిగాడు అనిల్. ‘ఆయన షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటారో కాదు కానీ, ఆ మనిషి నాకెంతో ఇష్టం..కానీ ఒక్క దగ్గర మాత్రం ఇరిటేషన్ వచ్చే ఎక్స్ ప్రెషన్ ఉంటది. జక్కన్న ఆ పాట చూపించవా అని అడుగు..జక్కన్నా కొంచెం త్వరగా వదిలాపెడతారా అని అడుగు..జక్కన్న బాబోయో కష్టంగా ఉందంటే..ఇలా ఏది అడిగినా ముఖంలో ఒక్కటే చిరునవ్వు ’ అంటూ ఇమిటేట్ చేశాడు ఎన్టీఆర్. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఫన్ చిట్ చాట్ వీడియోపై ఓ లుక్కేయండి మరీ..
ఈ ప్రాజెక్టులో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాంచరణ్ (Ram Charan) నటిస్తుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీమ్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియా భట్ సీత రోల్ చేస్తుండగా..అజయ్ దేవ్గన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

