లూడో, షకీలా, కాగజ్, మిమీ, అంగ్రేజీ మీడియం, బంటీ ఔర్ బబ్లీ చిత్రాలతో ఇండియావైడ్ గా పాపులర్ అయిపోయాడు బీహారీ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi). ఈ డిజిటల్ ప్లాట్ ఫాం హీరోకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)-హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh). త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ఓ ప్రముఖ వ్యక్తి నటించబోతున్నాడని హింట్ ఇచ్చిన హరీష్ శంకర్, ఇంతకీ అతనెవరో కన్ఫామ్ చేశాడు.
మీర్జాపూర్ సిరీస్‌తో చాలా మందికి దగ్గరైన పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాడని కన్ఫామ్ చేశాడు. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ ఓ పాట కూడా కంపోజ్ చేసినట్టు టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అత్యంత భారీ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
పవన్ కల్యాణ్ సినిమాలో ఈ బాలీవుడ్ యాక్టర్ ఎంట్రీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే పవన్ నటించిన భీమ్లానాయక్ ప్రేక్షకుల ముందుకొచ్చి..బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇక హరీష్ శంకర్ సినిమాతో బిజీ కాబోతున్నట్టు తాజా అప్ డేట్‌తో తెలిసిపోతుంది.