శివ దర్శకత్వంలో విజయ్ ఆంటోని (Vijay Antony) హీరోగా నటించిన చిత్రం బిచ్చగాడు (Bichagadu) . ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ట్రెండ్ సెట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చిత్రానికి సీక్వెల్ బిచ్చగాడు 2 (Bichagadu 2) రాబోతుంది. సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించాడు విజయ్ ఆంటోనీ.
విజయ్ ఆంటోనీ స్వీయదర్శకత్వం వహిస్తూ సీక్వెల్లో హీరోగా నటిస్తుండటం విశేషం. నువ్వు చేయబోయే పుణ్యం..నువ్వు వెతుకుతున్నది నీకు అందిస్తుంది. చరిత్రను సంపన్నులురాశారు. పేదల బతులకు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాయడానికి..బిచ్చగాడు 2, ఇవ్వరా వెయ్యరా..ఢమ ఢమ ఢమ డబ్బులిసిరి వేయరా అంటూ సాగుతున్న యాంటీ బికిలీ (విజయ్ ఆంటోనీ పాత్ర పేరు) థీమ్ సాంగ్ (Bichagadu 2 Theme Song) సినిమా ఎలా ఉండబోతుందో చెబుతూ సాగుతోంది.
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కావ్య థాపర్ (Kavya Thapper) ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. విజయ్ ఆంటోనీ బెంజ్ కారులో నుంచి దిగి బిచ్చగాడి వేషం వేసుకుని, మాస్క్ పెట్టుకుని ఆటోలో బయలుదేరుతున్న విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
SVP Second song | గెట్ రెడీ అంటోన్న మహేశ్‌బాబు టీం