Jitendra Mishra: సీఈవో ఇంటర్వ్యూకు ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా హాజరు కాలేదా?.. రామజన్మభూమి ట్రస్టు ఏమన్నదంటే
Jitendra Mishra: అయోధ్య రామాలయానికి జితేంద్ర మిశ్రా సీఈవోగా నియమితులైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇంటర్వ్యూకు హాజరుకాలేదని ఆరోపణలు వస్తున్నాయి. షార్ట్‌లిస్టు చేసిన 16 మంది అభ్యర్థుల్లో మిశ్రా లేరని ఐపీఎస్ ఆఫీసర్ రాజేశ్ పాండే ఆరోపించారు. ఈ అంశంపై రామజన్మభూమి తీర్థక్షేత్ర క్లారిటీ ఇచ్చింది.
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి ఇటీవల రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను సీఈవోగా నియమించిన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇంటర్వ్యూకు హాజరుకాలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వివరణ ఇచ్చింది. జితేంద్ర ఇంటర్వ్యూకు హాజరు కాలేదన్న వార్తలు అవాస్తవం అని, టాప్ త్రీ అభ్యర్థుల్లో ఆయన కూడా ఉన్నారని, దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని ట్రస్టు జనరల్ సెక్రటరీ స్వామి గోవింద దేవ్ గిరి ఓ ప్రకటనలో తెలిపారు.
రామ మందిరం నిర్వహణ చూసుకుంటున్న శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర తన ప్రకటనలో మీడియా వార్తలను ఖండించింది. అత్యున్నత ప్రమాణాల ప్రకారం పారదర్శకంగా ఇంటర్వ్యూ నిర్వహించినట్లు జనరల్ సెక్రటరీ తెలిపారు. మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ జరిగినట్లు ఆయన వెల్లడించారు. రామజన్మభూమి తీర్థ ఏర్పాటు చేసిన ప్యానెల్.. మిశ్రాను ఎంపిక చేసింది. దీంతో ఆయన రామాలయం తొలి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
ఇంటర్వ్యూలో భాగంగా సుమారు 5585 దరఖాస్తులను పరిశీలించారు. మూడు నగరాల్లో ఎంపిక ప్రక్రియ జరిగిందని, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, సంబల్పుర్ పట్టణాల్లో ఎంపిక ప్రక్రియ జరిగినట్లు ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. తొలుత 16 మంది అభ్యర్థులను షార్ట్ లిస్టు చేశారని, ఆ తర్వాత ఆగస్టు 11, 12 తేదీల్లో అయోధ్యలో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. అయితే తొలి రోజు తొలి సెషన్లోనే ఎయిర్ మార్షల్ మిశ్రా ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
కానీ మిశ్రా ఇంటర్వ్యూకు హాజరుకాలేదని ఐపీఎస్ ఆఫీసర్ రాజేశ్ పాండే ఆరోపించారు. ఆయన కూడా సీఈవో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. సీఈవోగా నియమితుడైన వ్యక్తి కనీసం షార్ట్‌లిస్టు చేసిన 16 అభ్యర్థుల్లో కూడా లేరని రాజేశ్ పాండే ఆరోపించారు. ఇదే అంశంలో ట్రస్టుకు లేఖ రాసినట్లు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ థాకూర్ పేర్కొన్నారు. ఒకవేళ పాండే ఆరోపణలు నిజమే అయితే అప్పుడు ఆ ఎంపిక ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం అవుతాయని థాకూర్ అన్నారు. ట్రస్టు దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు.
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र, न्यास के मुख्य कार्यकारी अधिकारी के चयन के संबंध में तथ्यों को स्पष्ट करना चाहता है, ताकि कुछ मीडिया के माध्यम से प्रसारित होने वाली गलत जानकारी को संबोधित किया जा सके।
प्रलेखित तथ्य
1. 6 जुलाई 2026 को खोज समिति का गठन किया गया।
2. खोज समिति को… pic.twitter.com/dLJJrmhQpQ
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) September 14, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

