Pushpa 2 The Rule | తెలుగు ప్రజలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాంచైజీ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ అందిస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. పుష్ప 2 ది రూల్‌లో కిస్సిక్ స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల మెస్మరైజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. శ్రీలీల-అల్లు అర్జున్ స్టెప్పులకు డ్యాన్స్ ఫ్లోర్ ఎలా దద్దరిల్లిపోనుందో మేకర్స్ లాంచ్ చేసిన శ్రీలీల పోస్టర్ చెప్పకనే చెబుతోంది. కాగా ఈ పాట కోసం శ్రీలీల తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్త ఒకటి హాట్ టాపిక్‌గా మారింది.
తాజా టాక్ ప్రకారం ఈ సాంగ్ కోసం శ్రీలీల ఏకంగా కోటి రూపాయల చెక్ అందుకుంటుందట. మొత్తానికి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని.. డిమాండ్ ఉన్నప్పుడే టాప్ పే చెక్ తీసుకుంటూ చెప్పకనే చెబుతోంది.
సీక్వెల్లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తుండగా.. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?