Swag | టాలీవుడ్ యాక్టర్ శ్రీ విష్ణు (Sree Vishnu) ఇటీవలే స్వాగ్ (SWAG) సినిమాతో ప్రేక్షకుల ముందు కొచ్చాడని తెలిసిందే. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ, దక్షా నగార్కర్ మరో కీ రోల్స్‌లో నటించారు. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాను థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. స్వాగ్ ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. స్వాగ్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియాట్రికల్ రిలీజ్ తర్వాత కేవలం మూడు వారాల్లోనే సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన స్వాగ్ మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
హసిత్ గోలి చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథకు కామెడీ టచ్‌ను జోడిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
శ్రీవిష్ణు స్వాగ్‌లో దివాకర్ పేట ఎస్ఐ భవభూతితోపాటు మరో మూడు పాత్రల్లో నటించి వన్ మ్యాన్ షోలా సినిమాకు ముందుకు నడిపించాడనంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వింజామర వంశపు రాణి రుక్మిణి దేవిగా రీతూవర్మ రాజసం ఉట్టిపడే రాయల్ లుక్‌లో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి.
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి