ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 10:58:32

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి

శ్రీముఖి.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యాంక‌ర్‌గా, బిగ్ బాస్ 3 ర‌న్న‌ర్‌గా  తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన బ్యూటీ శ్రీముఖి. ఎప్పుడు గ‌ల‌గ‌ల మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించే శ్రీముఖి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. త‌న సొంత ఊరు నిజామాబాద్‌లో కొత్త ఇల్లు నిర్మించుకుంటుంది. ఇందులో భాగంగా గ‌డ‌ప ఏర్పాటుకి సంబంధించిన పూజ కార్య‌క్ర‌మాలలో పాల్గొంది.  ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇవి ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి. శ్రీముఖి యాంక‌ర్‌గానే కాదు న‌టిగాను అడ‌పాద‌డాపా అల‌రిస్తూ ఉంటుంది. ఆ మ‌ధ్య శ్రీముఖి ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఆ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.