టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో యాక్టర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు సోనూసూద్ ( Sonu Sood ). లాక్ డౌన్ కాలంలో వేలాది మందికి అండగా నిలిచి రియల్ హీరోగా నిలిచాడు. అప్పటివరకు విలన్ గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సోనూసూద్ ఆ తర్వాత తన రూటు మార్చి పాజిటివ్ క్యారెక్టర్లలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఇప్పటికే పంజాబీ మ్యూజికల్ వీడియోలో నటించిన సోనూసూద్ తాజాగా మరో మ్యూజిక్ వీడియో సినీ లవర్స్ ను పలుకరించేందుకు రెడీ అయ్యాడు.
ఇంతకీ ఈ రియల్ హీరోతో మ్యూజిక్ వీడియోలో మెరిసే భామ ఎవరో తెలుసా..? ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్న నిధి అగర్వాల్ (Niddhi Agerwal). ఫరాఖాన్ డైరెక్షన్లో ‘ సాత్ క్యా నిభావోగే ’ (Saath kya Nibhaoge) మ్యూజిక్ వీడియోలో నటించారు సోనూసూద్, నిధి అగర్వాల్. ఈ పాటను కూడా పంజాబ్ లో చిత్రీకరించడం విశేషం. ఈ ఇద్దరు యాక్టర్లు సోషల్ మీడియా ద్వారా మ్యూజిక్ వీడియో ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేశారు. సాంగ్ టీజర్ ఆగస్టు 5న విడుదల చేయనున్నట్టు తెలిపారు.
సోనూసూద్ చేతిలో తుపాకీతో స్టైలిష్ గా కనిపిస్తూ నిధిని దగ్గరకు తీసుకున్న స్టిల్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సాంగ్ ఆఫ్ ది ఇయర్ సాత్ క్యా నిభావోగే పాట వస్తోంది రెడీ గా ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సోనూసూద్. ఫరాఖాన్ తో పనిచేయడం ఎప్పుడూ అద్బుతంగా ఉంటుంది అని కామెంట్ పెట్టాడు సోనూసూద్.
Get ready for song of the year 'Saath Kya Nibhaoge', @AgerwalNidhhi
— sonu sood (@SonuSood) August 3, 2021
@TheFarahkhan
@DesiMusicFactory @Tonykakkar #AltafRaja @AnshulGarg80 #desimusicfactory #SaathKyaNibhaoge pic.twitter.com/Kl5QTbKQe0
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో