Siva Koratala | కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్రోల్లో నటించిన చిత్రం దేవర (Devara). దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది. కాగా దేవర ప్రాంఛైజీగా రాబోతుందంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయని తెలిసిందే.
దేవర 3 కూడా ఉంటుందని వస్తున్న వార్తలపై చిట్ చాట్‌లో క్లారిటీ ఇచ్చాడు కొరటాల. దేవర చిత్రాన్ని ప్రాంఛైజీగా మార్చాలని నేనెప్పుడూ అనుకోలేదు. కథను ఒక సినిమాలో చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చా. దేవరలో వచ్చే కాంప్లెక్స్ క్యారెక్టర్లు, కథనాలు నన్ను సెకండ్ పార్టు కూడా చేసేలా చేశాయి. సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించాం. మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నాడు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2, ఎన్టీఆర్ 31 సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే.
ఎర్ర సముధ్రం, ఆయుధాల వేట నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నలించాడు. సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Dil Raju | వేటగాడు టైటిల్ అనుకున్నారు కానీ.. రజినీకాంత్ వెట్టైయాన్ తెలుగు టైటిల్‌పై దిల్ రాజు
SSMB 29 | మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మొదలయ్యే టైం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!
దేవర బ్లాక్ బస్టర్ ప్రోమో..