Siruthai Siva | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిరుతై శివ (Siruthai Siva) తాజాగా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. సూర్య టైటిల్ రోల్లో నటించిన ఈ పీరియాడిక్ డ్రామా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయిందని ఇప్పటివరకు వచ్చిన టాక్, రివ్యూస్ చెబుతున్నాయి. కాగా కంగువ దర్శకుడి కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా ప్రకారం అజిత్‌కుమార్‌తో చేయనున్న ఏకే 64 (AK64) ప్రాజెక్టును శివ 2025 ఏప్రిల్‌లో మొదలుపెట్టబోతున్నాడట. అంతేకాదు 2025 ఇయర్ ఎండింగ్లోపే సినిమాను పూర్తి చేసి 2026 పొంగళ్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్టు కోలీవుడ్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. అనంతరం కంగువ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టబోతున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
అజిత్ కుమార్ ప్రస్తుతం మగిజ్ తిరునేని దర్శకత్వంలో విదాముయార్చి సినిమా చేస్తున్నాడు. ఏకే 62గా వస్తోన్న ఈ మూవీలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీని 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తు్న్నారు. మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఏకే 63ను కూడా లైన్లో పెట్టాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో రాబోతుంది.
#AK64 – Project begins from April 2025 and will be completed by the end of the year..🤝 (PONGAL 2026..💥❓)
After that #SiruthaiSiva will be working on #Kanguva Sequel..✌️ Confirmed by KEGnanavelRaja..✅ pic.twitter.com/w6Z0k79j4b
— Laxmi Kanth (@iammoviebuff007) November 15, 2024
The Rana Daggubati Show | నాకు ఏం తెలియదు.. ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ వచ్చేసింది
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట