Stree 2 | బాలీవుడ్ యాక్టర్లు శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు కాంబోలో వచ్చిన సీక్వెల్ ప్రాజెక్ట్ ‘స్త్రీ 2’ (Stree 2). అమర్ కౌశిక్ దర్శకత్వంలో హార్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్ డే నుంచి వసూళ్ల విషయంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన స్త్రీ 2 ఇప్పటికే ఓపెనింగ్ డేన ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) వసూళ్లను అధిగమించడంతోపాటు ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
తాజాగా మరో అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది. ఈ మూవీ కేజీఎఫ్ 2 లైఫ్ టైం హిందీ వెర్షన్ కలెక్షన్లను అధిగమించింది. కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ రూ.435 కోట్లు గ్రాస్.. కాగా స్త్రీ 2 ఇండియావైడ్‌గా రూ.442 కోట్లు వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు భారత్‌లో యానిమల్, పఠాన్, గాదర్ 2 లైఫ్ టైం వసూళ్లను కూడా సులభంగా అధిగమించే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు.
మరి శ్రద్దాకపూర్ స్త్రీ.. త్వరలో షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీ హిట్ జవాన్ ఇండియా గ్రాస్ రూ.593 కోట్లు (హిందీ వెర్షన్)ను క్రాస్ చేస్తుందా..? అనేది చూడాలి. స్త్రీ 2 రాబోయే రోజుల్లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Coolie | రజినీకాంత్ కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ నటుడు.. ఇంతకీ పాత్రేంటో మరి..?
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!