Shivaji | దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ మాట్లాడుతూ.. అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఇప్పటికే శివాజీ క్షమాపణలు కూడా తెలియజేశాడు.
తాజాగా తన స్పీచ్‌పై మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు శివాజీ. తనతోపాటు స్టేజ్‌పై ఉన్న ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాడు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. నా స్టేట్మెంట్కు కట్టుబడే ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రం తప్పుగా మాట్లాడానన్నాడు శివాజీ. ఆ రోజు స్టేజీ మీదున్న నా తోటి నటీనటులు, ఆడబిడ్డలకు మొదట క్షమాపణలు చెప్పాలి. ఆ పదాలు దొర్లకూడదు. నేనిక్కడికి వచ్చి 30 సంవత్సరాలైంది.. నా జీవితంలో ఎప్పుడూ ఇలా జరుగలేదన్నాడు.
అన్ని సంవత్సరాలు పాలిటిక్స్‌లో ఉన్నా ఏ రోజూ కూడా ఒక చిన్నమాట జగన్ గారినైనా.. లేదంటే ఏ మహిళనైనా, ఏ పార్టీనైనా నా హద్దుదాటి మాట్లాడలేదు. అలాంటిది మరి ఎందుకో నాకు అలా తెలియకుండానే మాట దొర్లిపోయింది. చాలా బాధపడ్డా. ఆ రెండు పదాలు వాడినందుకు నా ఆడబడ్డలకు క్షమాపణలు చెబుతున్నానన్నాడు.
బయట నుంచి హీరోయిన్లు కానీ, మన హీరోయిన్లు కానీ కాస్త ఫంక్షన్లకు వెళ్లేటపుడు కొంచెం మంచి బట్టలు వేసుకుని వెళ్లండమ్మా.. మనకెందుకీ దరిద్రం.. బయట వాళ్లందరూ ఎగబడతారు. మొన్న మనమక్కడ చూశాం కదా.. కొత్తగా చూపించేది తర్వాత ఒక పదం వాడాను. ఆ పదం అస్సలు వాడకూడదు. నాకిప్పటికీ కూడా అది నన్ను ఎన్నాళ్లు వేంటాడుతుందో తెలియదన్నాడు శివాజీ. నేనా ఈ పదం వాడింది అని అనిపించింది.. ఒకే నేను మనిషినే.. నాకు కర్మలుంటాయి.. పొరపాటు జరిగిందని చెప్పుకొచ్చాడు శివాజీ. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Dhurandhar | ‘ధురంధర్’ కలెక్షన్లపై పాక్ ప్రజల వింత డిమాండ్.. కలెక్షన్స్‌లో మాకు వాటా ఇవ్వాలి..
Nani | నాని ‘ది ప్యారడైజ్’లో డ్రాగన్ బ్యూటీ.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Karate Kalyani | హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. కరాటే కల్యాణి ఊహించని స్పందన