Sharwa 38 | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. శర్వానంద్ ఇప్పటికే Sharwa 36, Sharwa 37 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఈ సినిమాలు సెట్స్‌పై ఉండగానే శర్వానంద్ కొత్త సినిమాను ప్రకటించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. సంపత్ నంది డైరెక్షన్లో శర్వా 38 మూవీని ప్రకటించాడు. అనౌన్స్మెంట్ పోస్టర్లో నీటిపై మంటలను చూడొచ్చు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు సంపత్ నంది. భయం ప్రపంచాన్ని హింసతో రౌండప్ చేసినప్పుడు.. కొత్త ప్రపంచాన్ని రూపొందించడానికి రక్తం ఆయుధంగా మారుతుంది.. అంటూ ఇచ్చిన ట్యాగ్‌లైన్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్నారు. ఇక అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న Sharwa 36లో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది..అంటూ ఇప్పటికే ఓ లుక్ షేర్ చేశారు మేకర్స్.
మరోవైపు Sharwa 37 చిత్రాన్ని సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. అద్భుతమైన ఫన్ రైడ్ అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఓ లుక్ అందరితో పంచుకుంది.
#Sharwa38 @ImSharwanand @IamSampathNandi team up ! #SharwaSampathBloodFest 🔥 pic.twitter.com/FaZy8idpdo
— BA Raju’s Team (@baraju_SuperHit) September 19, 2024
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్