
తాత సీనియర్ ఎన్టీఆర్‌కు తగ్గ మనుమడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దానికి తోడు ఇప్పుడున్న హీరోల్లో డైలాగులు చెప్పాలంటే.. తారక్ తర్వాతే ఎవరైనా. ఎలాంటి డైలాగులు అయినా కూడా అలవోకగా చెప్పేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకులు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం ఇండియాకు తిరిగి రానుంది. వచ్చీ రాగానే కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నాడు జూనియర్. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పుడు ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా పనిలో బిజీగా ఉన్నాడు కొరటాల. ఇది పూర్తయ్యాక జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు కొరటాల శివ. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సీనియర్ ఎన్టీఆర్ క్లాసిక్ టైటిల్ ఒకటి వాడుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అదేంటో తెలుసా.. వేటగాడు.

అప్పట్లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన వేటగాడు సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ శ్రీదేవి, డ్యాన్సులకు అందరూ ఫిదా అయిపోయారు. అప్పట్లో టాలీవుడ్ రికార్డులను తిరగ రాసింది వేటగాడు. ఇప్పుడు కొరటాల శివ రాసుకున్న కథకు వేటగాడు టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ బ్యానర్స్ పై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
God father |చిరంజీవిని సంపత్ నంది కలవడానికి అసలు కారణం అదేనా..?
చిరంజీవి లూసిఫర్ రీమేక్‌లో విలన్‌గా సత్యదేవ్ ?
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌ల్లోనూ హీరోయిన్ల హవా