గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 00:09:34

సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’

సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’

విభిన్న కథాంశాలతో ప్రత్యేకతను చాటుకుంటున్న యువ హీరో సత్యదేవ్‌ తాజాగా ‘తిమ్మరుసు’ చిత్రంలో నటించబోతున్నారు. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ఉపశీర్షిక. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకుడు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకాలపై మహేష్‌ కోనేరు, సృజన్‌ నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను సోమవారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం. సత్యదేవ్‌ ఇమేజ్‌కు తగినట్లుగా వైవిధ్యమైన కథాంశమిది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని నిర్మాతలు తెలిపారు.
logo