కేరళ కుట్టి సాయి పల్లవి తన పాటలతో యూట్యూబ్‌ని ఎంతగా షేక్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో సాయి పల్లవి నటించిన ఫిదా చిత్రంలోని మెల్లగా వచ్చిండే, మారి 2లోని రౌడీ బేబి సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేశాయి. ఇక ఇప్పుడు నాగచైతన్య తో కలిసి నటిస్తున్న లవ్‌స్టోరీ సినిమాలోని సారంగదరియా పాటతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 100,150,200 మిలియన్స్ వ్యూస్‌ని అలవోకగా అందుకున్న సారంగదరియా పాట తాజాగా యూట్యూబ్‌లో 250 మిలియన్ల వ్యూస్ సాధించింది.
జానపద గీతం ‘సారంగదరియా’ కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ చేసిన ట్యూన్స్…ఆ ట్యూన్ కు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం పాటని ఆఫ్ స్క్రీన్ హిట్ చేస్తే….ఆన్ స్క్రీన్ మీద శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, సాయి పల్లవి వేసిన డాన్సులు, ఆ పాటకు నేటివ్ తెలంగాణ నేపథ్యాన్ని ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఆలోచనలు పాట ప్రేక్షకులలోకి బాగా చేరేలా చేసింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది.లవ్ స్టోరీ ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు.