కొవాగ్జిన్ మూడో విడత ట్రయల్స్‌పై నేడు నిపుణుల కమిటీ సమీక్ష
కొవాగ్జిన్ మూడో ట్రయల్స్‌పై నేడు నిపుణుల కమిటీ సమీక్ష | కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ డేటా వివరాలను భారత్ బయోటెక్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సమర్పించింది.

న్యూఢిల్లీ : కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ డేటా వివరాలను భారత్ బయోటెక్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సమర్పించింది. ఈ క్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) నేడు సమావేశం కానున్నది. హైదరాబాద్‌కు చెందిన టీకా అంతర్జాతీయ అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్) కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతో బుధవారం ‘ప్రీ-సబ్మిషన్’ సమావేశం సైతం జరుగనుంది. అత్యవసర వినియోగ జాబితా కోసం ట్రయల్ డేటాలో భద్రత, సమర్థత, నాణ్యత, రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను పరిశీలిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందితే భారత్ బయోటెక్ టీకాలను ఎగుమతి చేయడంతో పాటు కొవాగ్జిన్ టీకా తీసుకున్న భారతీయ పౌరులు అంతర్జాతీయ ప్రయాణాన్ని సైతం సులభతరం చేస్తుంది. మార్చిలో భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్ తొలి మధ్యంతర ఫలితాలను ప్రకటించింది. టీకా 81శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న మూడు టీకాల్లో కొవాగ్జిన్ ఒకటి. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో తయారు చేసింది.
ఇవి కూడా చదవండి..
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
జగిత్యాల యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నేడు 2.09లక్షల మంది ఖాతాల్లోకి ‘రైతుబంధు’
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

