హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంకు శాఖలో మంగళవారం మంటలు చేలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి.. బ్యాంకులో ఉన్న దస్త్రాలు, ఫర్నీచర్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.