పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే?
పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే? | జనవరి నుంచి సియోనిలోని పెంచ్ టైగర్ రిజర్వులో మూడు పులులు మరణించాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు నమూనాలను పంపినా మరణాలకు కారణాలు తెలియరాలేదు.

భోపాల్ : జనవరి నుంచి సియోనిలోని పెంచ్ టైగర్ రిజర్వులో మూడు పులులు మరణించాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు నమూనాలను పంపినా మరణాలకు కారణాలు తెలియరాలేదు. అనంతరం రక్తం, ఒరోఫారింజియల్ నమూనాలను తీసుకోవాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు భారత్‌లో తొలిసారిగా పులులకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెంచ్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ వీఎస్ పరిహార్ మాట్లాడుతూ గత 20 రోజులుగా అటవీశాఖకు చెందిన ఆరుగురు అధికారులు రెండు ఏనుగుల సహాయంతో నమూనాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే, ఇప్పటి వరకు పులులను గుర్తించలేదని తెలిపారు.
గతంలో పులుల సంఖ్యను లెక్కింగా.. టైగర్ రిజర్వులో 53 ఉన్నాయని పేర్కొన్నారు. జనవరి నుంచి 5-8 సంవత్సరాల మధ్య వయస్సున్న మూడు పులులు మరణించాయని పరిహార్ తెలిపారు. వాటి మృతదేహాలపై విషం, గాయాల గుర్తులు కనిపించనందున పోస్టుమార్టం, ఎఫ్ఎస్ఎల్ నివేదిక సైతం ‘వేట’ అవకాశాలను సైతం తోసిపుచ్చింది. ఈ క్రమంలో మిగతా పులులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మరణానికి ఇతర వైరస్లు ఏమైనా కారణమా? అని ఆరా తీయనున్నారు. మరణాల వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు కనీసం ఐదు పులుల నమూనాలు సేకరించేందుకు అనుమతి కోరుతూ పెంచ్ టైగర్ రిజర్వ్ పరిపాలన గత నెలలో అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి లేఖ రాసినట్లు ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) అలోల్కుమార్ చెప్పారు.
ఇదిలా ఉండగా.. పెంచ్ రిజర్వ్‌లో పదేళ్ల మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ గతేడాది పర్యావరణ కార్యకర్త సంగీత డోగ్రా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొవిడ్ -19 కారణంగా పులి చనిపోయిందని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పులి మరణానికి కారణమేంటో నిర్ధారించాలని అత్యున్నత న్యాయస్థానం పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను ఆదేశించింది. అయితే, కరోనా కారణంగా పులి చనిపోయిందన్న వాదనను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది.
ఇవి కూడా చదవండి..
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
జగిత్యాల యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నేడు 2.09లక్షల మంది ఖాతాల్లోకి ‘రైతుబంధు’
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ
కొవాగ్జిన్ మూడో విడత ట్రయల్స్‌పై నేడు నిపుణుల కమిటీ సమీక్ష
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

