Sanjjanaa Galrani | కొన్ని రోజులుగా మాలీవుడ్‌లో క్యాస్టించ్ కౌచ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కేరళలో మీటూ ప్రకంపనల నేపథ్యంలో ప్రముఖ నటి సంజనా గర్లానీ (Sanjjanaa Galrani) కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసింది. కన్నడ ఇండస్ట్రీలో మహిళల భద్రతకు భరోసా కల్పించేందుకు అసోసియేషన్ ఏర్పాటు చేయాలని మెమోరాండం సమర్పించింది. సంజనా విజ్ఞప్తికి సీఎం సిద్దరామయ్య సానుకూలంగా స్పందించారు.
సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన భద్రతా చర్యలను ప్రారంభించాలి. మహిళలకు ఒక కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మహిళా కళాకారుల అవసరాలు, సమస్యలను తీర్చడానికి ప్రత్యేకంగా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొంది సంజనా గర్లానీ.
మాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు, నటీమణులపై కోస్టార్లు, ఇండస్ట్రీ ప్రముఖులు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో.. చలనచిత్ర పరిశ్రమలో వేధింపులపై విచారణకు జస్టిస్ హేమ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ హేమ కమిటీ ఇప్పటికే ఓ నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన సంజనా గర్లానీ రెండు సినిమాల్లో నటిస్తోంది.
#WATCH | Bengaluru | Actor Sanjjanaa Galrani met Karnataka CM Siddaramaiah today and submitted a memorandum to form an association to ensure the safety of those working in the Kannada film industry
(Source: Sanjjanaa Galrani) pic.twitter.com/zcyi6qlWlQ
— ANI (@ANI) September 5, 2024
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!