Samantha | టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత షూటింగ్లో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడ్డట్లు సమాచారం. మోకాలికి గాయం కావడంతో ఆక్యుపంక్చర్ పద్ధతిలో చికిత్స తీసుకుంటున్నది. చికిత్సకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. గాయాలపాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా ? అంటూ పోస్ట్ చేసింది. అయితే, ఏ మూవీ షూటింగ్లో గాయపడింది.. ప్రమాదం ఎప్పుడు జరిగిందనే వివరాలను మాత్రం సమంత వెల్లడించలేదు. అయితే, మా ఇంటి బంగారం మూవీ షూటింగ్లో గాయపడ్డట్లు తెలుస్తున్నది. సమంత తెలుగులో చివరిసారిగా ఖుషీ మూవీలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. బాలీవుడ్లో హీరో వరుణ్ ధావన్‌తో సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నది. ఈ ఏడాది నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నది. సిటాడెల్ ఇంగ్లిష్ వెర్షన్లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను బాలీవుడ్లో సమంత పోషిస్తున్నది.