Vivek Ranjan Agnihotri | ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri). వివాదాలను లెక్క చేయకుండా సున్నితమైన అంశాలను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరింపజేసే అతికొద్ది మంది టాలెంటెడ్ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు. కాంట్రవర్సియల్ స్టోరీస్‌తో వార్తల్లో నిలిచే ఈ దర్శకుడు తాజాగా సినిమా సెన్సార్‌షిప్‌పై తన అభిప్రాయాన్ని నెట్టింట షేర్ చేసుకున్నాడు.
ఏ సృజనాత్మక వ్యక్తీకరణను ఎప్పుడూ సెన్సార్ చేయకూడనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఇంకా సెన్సార్‌షిప్‌పై పట్టుబడితే టీవీ చర్చలు, వార్తా కార్యక్రమాలు, రాజకీయ ప్రసంగాలు, మతపరమైన ప్రసంగాలను ఎందుకు మొదలుపెట్టకూడదు.. ఇవి తరచుగా నకిలీ వార్తలు, విభజన, ద్వేషం, హింసకు సంబంధించిన నిజమైన మూలాలుగా కనిపిస్తాయి.
ఒకవేళ ఈ విషయం మిమ్మల్ని కించపరుస్తున్నట్టు కానీ.. లేదా మీ మనోభావాలను దెబ్బతీస్తుందని భావిస్తే.. ఆ విమర్శలను స్వీకరించడానికి మీరు కొంత మద్దతు పెంచుకోవాలి. సృజనాత్మక వ్యక్తీకరణ మీ పక్షాన్ని ప్రదర్శించకపోతే, మీ కేసును ప్రతిబింబించే దానిపై ఫోకస్ పెట్టండి. అన్నింటికంటే పిరికితనం ఉన్న వ్యక్తులు తమ వికారమైన కోణాన్ని బహిర్గతం చేసే వాటిని మాత్రమే సెన్సార్ చేస్తారంటూ తనదైన శైలిలో సెన్సార్‌షిప్‌పై సెటైర్లు వేశాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
CENSORSHIP:
No creative expression should ever be censored—that’s my personal view.
But if you still insist on censorship, why not start with TV debates, news programs, political speeches, and religious sermons? These are often the real sources of fake news, division, hate, and…
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 4, 2024
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!
Meenakshi Chaudhary | ది గోట్ కథకు నా పాత్ర చాలా ముఖ్యం : మీనాక్షి చౌదరి