Meenakshi Chaudhary | కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ది గోట్ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సినిమా విడుదల సందర్భంగా మీడియాతో సినిమా విశేషాలు షేర్ చేసుకుంది. ఈ చిత్రంలో నేను మోడ్రన్ యువతి పాత్రలో కనిపిస్తాను. నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో.. అంతే సారుప్యంగా, ఫన్నీగా నా క్యారెక్టర్ ఉంటుంది. సినిమాలో ప్రతీ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. సినిమా కథకు నా పాత్ర చాలా ముఖ్యమైందంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పోషిస్తుండగా.. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, వీటీవీ గణేశ్, అజ్మల్ అమీర్, మనోబాల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Ram Pothineni | హరీష్ శంకర్‌కు నో.. మహేశ్ బాబు సినిమాకు సై అంటోన్న రామ్..?
Ram charan | వరద బాధితులకు సపోర్టుగా.. రాంచరణ్, వైజయంతీ మూవీస్ భారీ విరాళం
Nani | టాలీవుడ్ అమీర్ ఖాన్ ప్రియదర్శి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నాని కామెంట్స్