Nani | కేరళకుట్టి నివేదా థామస్ (Nivetha Thomas), విశ్వదేవ్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న సినిమా 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu). నందకిశోర్ (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని సందడి చేశాడు. ఈ సందర్భంగా నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈవెంట్లో ప్రియదర్శినిని బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్‌తో పోల్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ప్రియదర్శి టాలీవుడ్ అమీర్ ఖాన్ అని.. 35 చిన్న కథ కాదు టాలీవుడ్ తారే జమీన్ అన్నాడు. నాని సినిమా, నటీనటులు అసాధారణ రీతిలో ఉంటే కానీ ఇలాంటి కామెంట్స్ చేయడు నాని. ఇక ప్రియదర్శి, సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. లిమిటెడ్ స్క్రీనింగ్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నేటి నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు మేకర్స్. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ప్రీమియర్స్ ఉండబోతున్నాయి.
ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. నివేదా థామస్ సరస్వతి అనే సాధారణ గృహిణి పాత్రలో నటిస్తుంది. తన భర్త, ఇల్లు, పిల్లల చదువు చుట్టూ సినిమా సాగనుందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. మొట్టికాయలేస్తెనే మోటివేషన్ వస్తుందిరా..అంటూ స్కూల్ విద్యార్థితో ప్రియదర్శి మాస్టర్ చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో చిన్న కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతుంది.
Suresh Raina | రామ్‌చరణ్ నా ఫేవరెట్.. ఆయనో డిఫరెంట్ యాక్టర్ : సురేశ్ రైనా
Nivin Pauly | ‘ప్రేమమ్’ నటుడిపై రేప్ కేసు.. స్పందించిన నివిన్ పౌలీ
35 చిన్న కథ కాదు ట్రైలర్..