Suresh Raina | టీమిండియా మాజీ ఆటగాడు (Former Indian Cricketer) సురేశ్ రైనా (Suresh Raina) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బెస్ట్ ఫ్రెండ్‌గానే కాకుండా.. తనదైన మెరుపు ఫీల్డింగ్, బ్యాంటిగ్తో కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా కూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రైనా ప్రస్తుతం పలు క్రికెట్ ఈవెంట్స్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేశ్ రైనా.. పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో ఎవరు అని యాంకర్ అడగ్గా.. ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. సౌత్ హీరోల్లో సూర్య అంటే ఇష్టమని చెప్పారు. ఆ తర్వాత తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన ఫేవరెట్ అని తెలిపారు. చరణ్ చాలా డిఫరెంట్ యాక్టర్ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ వీడియోను విపరీతంరగా ట్రెండ్ చేస్తున్నారు.
“RamCharan is on a Very Different Level as an Actor”.
– Suresh Raina
(Former Indian Cricketer & Mr.IPL)@AlwaysRamCharan 👑🔥 @ImRaina pic.twitter.com/bSdbNJ6GNL— Ujjwal Reddy (@HumanTsunaME) September 3, 2024
Also Read..
Nitin Gadkari: స్టెయిన్లెస్ స్టీల్ వాడి ఉంటే.. శివాజీ విగ్రహం కూలేది కాదు: నితిన్ గడ్కరీ
HYDRAA | హైడ్రా పేరుతొ డబ్బుల వసూళ్లకు పాల్పడితే జైలుకే : ఏవీ రంగనాథ్