Johny Master – Pawan Kalyan | టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో జాని మాస్టర్ పాల్గోని పవన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జాని మాస్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్.. 2029లో సీఎం అవుతారని చెప్పారు. అలాగే 2034లో భారతదేశ ప్రధాని అవుతారాని ఇది రాసిపెట్టుకోండని జాని మాస్టర్ తెలిపాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ధనుష్ నటించిన తిరుచిత్రబలం సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నాడు జాని మాస్టర్. జైలర్లోని కావాలయ్య పాటతో కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన కొరియోగ్రాఫిలో వచ్చిన చిత్రాల్లో బీస్ట్, రంగబలి, వారసుడు తదితర చిత్రాలు మంచి హిట్లు అందుకున్నాయి.
పవన్ కళ్యాణ్ 2029లో సీఎం అవుతాడు.. 2034లో ప్రధానమంత్రి అవుతాడు – జాని మాస్టర్ pic.twitter.com/FtAENX5wJH
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2024
Also read..