GOAT Movie | తమిళ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఉన్న హీరో అంటే దళపతి విజయ్ (Thalapathy Vijay) అని చెప్పకతప్పదు. తలైవర్ తర్వాత మాస్ ఫాలోయింగ్‌తో పాటు ఆ రేంజ్లో ఆభిమానులు ఉన్నది అతడికే. అయితే ఆయన సినిమా వస్తుందంటే చాలు ఆయన కోట్లాది మంది అభిమానులకు పెద్ద పండగే. ఇక తమిళనాడులో అయితే చెప్పక్కర్లేదు. విజయ్ పోస్టర్లతో థియేటర్లను మొత్తం నింపేస్తారు.
అయితే విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, వైభవ్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దళపతి సినిమా విడుదల రోజు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవును ప్రకటిస్తున్నాయి. తాజాగా పార్క్విక్ (ParkQwik ) అనే పార్కింగ్ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు గోట్ సినిమా రోజున సెలవును ప్రకటించింది.
సెప్టెంబర్ 05, 2024న తలపతి విజయ్ చిత్రం ది గోట్ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా.. మా కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటిస్తున్నాం. విజయ్ సర్‌పై ఉన్న అభిమానానికి చిహ్నంగా అలాగే మా ఉద్యోగులలో ఉన్న అపారమైన ఉత్సాహానికి గుర్తుగా, యాజమాన్యం ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. సినిమా హిట్ కావాలని ది గోట్ చిత్ర బృందానికి మా విషెస్ తెలుపుతున్నాం. అలాగే ఈ సినిమాకు సంబంధించి మా ఉద్యోగులకు కాంప్లిమెంటరీ టిక్కెట్లను కూడా అందించబోతున్నాం అంటూ పార్క్విక్ సీఈఓ అరుణ్ కుమార్ ప్రకటన విడుదల చేశాడు.
ParkQwik declared Holiday for their employees 🔥
Happens only for Thalapathy 💥💥#TheGreatestOfAllTime #TheGOAT pic.twitter.com/y49JvIQ8Yz
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) September 3, 2024
Also read..