Vyjayanthi Movies | భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయని తెలిసిందే. వరద ముంపుతో నిరాశ్రయులైన బాధితుల కోసం అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ ప్రముఖులు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా వైజయంతీ మూవీస్ రూ.45 లక్షలు విరాళంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20 లక్షలు ప్రకటించింది. స్టార్ యాక్టర్ రాంచరణ్ రూ.కోటి విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించాడు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది.
నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశాడు.
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి…
— Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024
Together, let’s make tomorrow better.@TelanganaCMO pic.twitter.com/6QQPfOnsgd
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 4, 2024
Let’s strive for a better tomorrow.@AndhraPradeshCM pic.twitter.com/AvneI83YAo
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 2, 2024
టాలీవుడ్ సెలబ్రెటీలు ఇచ్చిన విరాళాల వివరాలు..
– మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– మహేశ్‌బాబు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం
– త్రివిక్రమ్, సూర్యదేవర రాధాకృష్ణ, నాగవంశీ కలిసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 25 లక్షల చొప్పున విరాళం
– సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 15 లక్షల చొప్పున 30 విరాళం
– విశ్వక్సేన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల విరాళం