Ram Pothineni | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన డబుల్ఇస్మార్ట్ భారీ అంచనాల మధ్య విడుదల కాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ ఈవెంట్లో హరీష్ శంకర్ ఫైనల్ స్క్రిప్ట్‌ను త్వరలోనే రామ్‌కు అందిచండంతోపాటు సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని హింట్ ఇచ్చాడు.
అయితే ఫిలిం నగర్ సర్కిల్ కథనాల ప్రకారం హరీష్ శంకర్‌తో సినిమా చేసేందుకు రామ్ రెడీగా లేడట. స్కంద, వారియర్, డబుల్ ఇస్మార్ట్ నిరాశపర్చడం, మరోవైపు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ బోల్తా కొట్టడంతో సరైన కథ దొరికే వరకు మాస్ సబ్జెక్టును పక్కన పెడితే బాగుంటుందని రామ్ భావిస్తున్నాడని వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇక ముందుగా వచ్చిన వార్తల ప్రకారం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు (Mahesh Babu P) డైరెక్షన్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలు కానుందంటూ వార్తలు రాగా.. మరి రామ్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని తెలుస్తోంది. మరి మహేశ్ బాబు ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ను ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Ram charan | వరద బాధితులకు సపోర్టుగా.. రాంచరణ్, వైజయంతీ మూవీస్ భారీ విరాళం
Nani | టాలీవుడ్ అమీర్ ఖాన్ ప్రియదర్శి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నాని కామెంట్స్