Actor Fish Venkat | టాలీవుడ్ కమెడియన్ ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికి ఇతను తెలిసే ఉంటాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ గ్యాంగ్ పాత్రతో ఫిష్ వెంకట్‌కి మంచి పేరు వచ్చింది. తెలంగాణ యాసలో మాట్లాడే ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీని ఎక్కువ మంది అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య ‘ఫిష్’ వెంకట్ సినిమాలలో ఎక్కువ కనిపించడం లేదు. ఆయన సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదని తెలుసుకుంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం వలన అని తెలిసింది.
ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌పై చేసిన ఓ వీడియో వలన ఈ విషయం బయటకు వచ్చింది. అసలు ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సదరు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌ను అడుగగా.. తన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని తన పరిస్థితి గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు ఈ పరిస్థితి వచ్చిన ఇప్పటివరకు ఎవరికి చెప్పుకోలేదని తనకి ఇద్దరు మగపిల్లలు .. ఒక ఆడపిల్ల ఉన్నారనీ, మగపిల్లలు డబ్బు పరంగా ఎలాంటి సాయం చేయడం లేదని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక ఫిష్ వెంకట్ పరిస్థితిని తెలుసుకున్న నెటిజన్లు చలించిపోతున్నారు. ఫిష్ వెంకట్‌కు సాయం చేయడంటూ ప్రభుత్వంతో పాటు తెలుగు హీరోలకు సందేశాలు పెడుతున్నారు.
Also read..