Sangareddy | ఫార్మా సిటీ భూసేకరణ నిరసిస్తూ పంచాయతీ కార్యదర్శిని బంధించిన గ్రామస్తులు
Sangareddy | ఫార్మాసిటీపై(Pharmacy city) రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తమకు జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదంటూ భూ బాధితులు, ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు.
సంగారెడ్డి : ఫార్మాసిటీపై(Pharmacy city) రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తమకు జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదంటూ భూ బాధితులు, ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. నిన్నటికి నిన్న భూములు ఇచ్చే ప్రసక్తే లేదని సంగారెడ్డి జిల్లా(Sangareddy) న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రమైన న్యాల్కల్లోని ప్రధాన వీధు ల గుండా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, భూబాధితులు, ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లోని న్యాల్కల్-ముంగి ప్రధాన రోడ్డు మార్గంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజాగా న్యాల్కల్లో ఫార్మా సిటీ భూసేకరణ నిరసిస్తూ ఫార్మాసిటీ భూ బాధితులు డప్పుర్ కార్యదర్శిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా ఇస్తామని, వాటిని మాత్రం వదులుకునేది లేదని, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భయపడేదిలేదని స్పష్టం చేశారు. తమ గ్రామాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

