అమరావతి : ఏపీలోని విజయవాడ (Vijayawada) ముంపునకు కారణమైన బుడమేరు (Budameru) వాగుకు మళ్లీ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న దాదాపు వెయ్యి క్యూసెక్కులే ఉన్న వరద ప్రవాహం బుధవారం ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరకు వరద వస్తుందని, మరో అడుగు వరద పెరగవచ్చని భావిస్తున్నారు. దీంతో స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు.
బుడమేరుకు మూడుచోట్ల గండిపడగా ఇప్పటికే మొదటి గండిపూడ్చి మితగా రెండు గండ్లను పూడ్చడానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో గండ్లు పూడ్చడానికి పనుల్లో ఆటంకం ఎదురవుతుంది. ఈ పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు(Minister Nimmala), నారా లోకేష్ (Nara Lokesh) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.