Akhilesh Yadav : బుల్డోజర్లతో ఇతరులను భయపెట్టేవారు పలు ప్రాంతాల్లో ప్రజల ఇండ్లను కూల్చివేస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. అఖిలేష్ బుధవారం లక్నోలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అసలు సీఎం నివాస మ్యాప్‌నకు ఆమోదం ఉందా అని ఆయన ప్రశ్నించారు. దాన్ని ఎప్పుడు ఆమోదించారు..దానికి సంబంధించిన పత్రాలను చూపాలని అఖిలేష్ నిలదీశారు.
మీరు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునే వారిపై బుల్డోజర్లు నడుపుతున్నారని, ప్రత్యర్ధులను భయపెట్టేందుకు బుల్డోజర్లను దించుతున్నారని మండిపడ్డారు. బుల్డోజర్లను ప్రయోగించరాదని నిన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అఖిలేష్ యాదవ్ గుర్తు చేశారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుతో ఇప్పటివరకూ బుల్డోజర్లతో ధ్వంస రచన సాగించినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు.
బుల్డోజర్ నడిపేందుకు మెదడు అవసరం లేదని, స్టీరింగ్ ఉంటే చాలని అన్నారు. ఓ వ్యక్తి బుల్డోజర్ స్టీరింగ్‌ను యూపీ ప్రజలు మార్చేస్తారని అఖిలేష్ స్పష్టం చేశారు. కాగా, మహిళలపై నేరాల విషయంలో యూపీ ముందువరసలో ఉందని అంతకుముందు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సరిగ్గా పనిచేయకపోవడంతో మహిళలపై వేధింపులు పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు సహా ప్రతి ఒక్కరి భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.
Read More :
Nitin Gadkari: స్టెయిన్లెస్ స్టీల్ వాడి ఉంటే.. శివాజీ విగ్రహం కూలేది కాదు: నితిన్ గడ్కరీ