KCR | వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత పురోగతి కేసీఆర్ దూరదృష్టి, నాయకత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014-15 నుంచి 2024-15 పదేళ్ల కాలంలో వరి సాగులో తెలంగాణ 240 శాతం వృద్ధి సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ మార్క్ అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కేటీఆర్ స్పందించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలే ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
వరి సాగు విస్తీర్ణంలో 2014-15 నుంచి 2024-25 పదేళ్ల కాలంలో ఇండియాలో వచ్చిన భారీ మార్పులను ది ఇండియన్ ఇండెక్స్ తాజాగా ప్రకటించింది. దీనిప్రకారం తెలంగాణలో అత్యధికంగా 240 శాతం వృద్ధి ఏర్పడిందని తెలిపింది. అలాగే మధ్యప్రదేశ్లో 80 శాతం, ఉత్తరప్రదేశ్లో 25 శాతం, తమిళనాడులో 20 శాతం, పంజాబ్లో 12 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. అదే ఆంధ్రప్రదేశ్లో వరి సాగు విస్తీర్ణం 13 శాతం పడిపోయిందని తెలిపింది. ఇక మణిపూర్లో 25 శాతం, అస్సాంలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, ఒడిశాలో 8 శాతం పడిపోయిందని పేర్కొంది.
The KCR Mark growth ✊
Telangana’s Agri success story is a testament to the resolve and leadership of KCR Garu
240% growth in rice cultivation area and production is a result of pioneering initiatives like “Rythu Bandhu, Rythu Bhima, Mission Kakatiya, Kaleshwaram & 24 hours of… https://t.co/QQVk6SLx6l
— KTR (@KTRBRS) January 9, 2026