Megha Akash | టాలీవుడ్ భామ మేఘా ఆకాశ్ (Megha Akash) ఇటీవలే తన ప్రియుడు సాయి విష్ణు (Saai Vishnu)తో నిశ్చితార్థం (engagement) పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేఘా ఆకాశ్ షేర్ చేసిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్‌కు ఇంకా సమయం ఉండటంతో మేఘా ఆకాశ్-సాయి విష్ణు వెకేషన్ టూర్ ప్లాన్ చేశారు. కొప్పులో అందమైన పూలు పెట్టుకొని.. లంచ్ టేబుల్ ముందు కూర్చొని కెమెరాకు క్యూట్ క్యూట్‌గా ఫోజులిచ్చింది.
ఇంతకీ ఈ భామ ఎక్కడికెళ్లిందనే కదా మీ డౌటు. ఐలాండ్ నేషన్ శ్రీలంకకు వెళ్లింది. తన గర్ల్ గ్యాంగ్‌తో జరుపుకున్న బ్యాచ్‌లర్ పార్టీ ట్రిప్‌కే హైలెట్‌గా చెప్పొచ్చు. మేఘా ఆకాశ్ వెకేషన్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. లై, ఛల్ మోహన్ రంగా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మేఘా ఆకాశ్. ఆ తర్వాత డియర్ మేఘ, గుర్తుందా సీతాకాలం చిత్రాల్లో మెరిసింది. ఆరేండ్లుగా ప్రేమలో ఉన్న మేఘా ఆకాశ్-సాయి విష్ణు ఫైనల్‌గా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుండటంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మేఘా ఆకాశ్ ప్రస్తుతం వికటకవి, సహకుటుంబం సినిమాల్లో నటిస్తోంది. మరి వివాహం తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌ను కొనసాగిస్తుందా..? లేదా.,? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.