టాలీవుడ్ (Tollywood) భామ సమంత (Samantha) త్వరలోనే సినిమాలు తగ్గించి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించబోతుందని అందరూ చర్చించుకునేలోపే నాగచైతన్య (Chay Akkineni) నుంచి విడిపోవడంతో షాక్‌కు లోనయ్యారు సినీజనాలు. విడాకుల తర్వాత తన సినీకెరీర్పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెప్తున్నాయి. సామ్ ఇటీవలే ఓ హిందీ సినిమాకు సంతకం చేసింది. కాగా సమంత కొత్త సినిమాలకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది.
దసరా (Dussehra) సందర్భంగా సామ్ పలు సినిమాలను ప్రకటించేందుకు రెడీ అవుతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటికే కొందరు యువ దర్శకులకు కథలను వినిపించాలని కూడా సూచనలు చేసిందట సమంత. పెండ్లి తర్వాత సినిమాల విషయంలో కొన్ని హద్దుల్లో ఉండిపోయిన సామ్ ఇక నుంచి ఎలాంటి సినిమాలతో అందరినీ పలుకరించబోతుందోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రీకరణ పూర్తయింది. మలయాళ నటుడు దేవ్‌మోహన్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్