Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha Ruth Prabhu) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తోంది. సామ్ గత కొన్ని రోజులుగా మయోసైటిస్ (Myositis)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకు అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకోనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా సమంతకు.. మయోసైటిస్ చికిత్స కోసం ఓ టాలీవుడ్ స్టార్ హీరో రూ.25 కోట్లు సాయం చేశారంటూ టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా.. పలు ఆంగ్ల మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. కాగా, ఈ వార్తలపై తాజాగా సమంత స్పందించారు. అందులో ఏ మాత్రం నిజం లేదని స్పస్టం చేశారు. చికిత్స కోసం వేరే వాళ్ల నుంచి సాయం పొందాల్సిన అవసరం తనకు లేదన్నారు.
‘మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా..!? ఎవరో మీకు తప్పుడు సమాచారం అందించారు. మీరు చెప్పిన దానిలో అతి తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా కెరీర్ లో ఇప్పటి వరకూ నేను చేసిన పనికి జీతంగా రాళ్లు ఇవ్వలేదని అనుకుంటున్నాను. కాబట్టి, నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. ధన్యవాదాలు. మయోసైటిస్ కారణంగా వేలాది మంది బాధపడుతున్నారు. ట్రీట్ మెంట్ కు సంబంధించిన సమాచారాన్ని అందించే ముందు దయచేసి కాస్త బాధ్యత వహించండి’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read..
Earthquake | గుల్మార్గ్లో భూకంపం.. 5.2 తీవ్రతతో కంపించిన భూమి
Influencer | ఇన్ఫ్లుయెన్సర్ ప్రకటనతో రణరంగంగా న్యూయార్క్.. ఇంతకీ ఏమైందంటే..?
Corona | యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్..!