Influencer | ఇన్ఫ్లుయెన్సర్ ప్రకటనతో రణరంగంగా న్యూయార్క్.. ఇంతకీ ఏమైందంటే..?
Influencer | ఓ ఇన్ఫ్లుయెన్సర్ (Influencer) చేసిన ప్రకటన కారణంగా న్యూయార్క్ (New York) నగరం రణరంగంగా మారింది.
Influencer | ఓ ఇన్ఫ్లుయెన్సర్ (Influencer) చేసిన ప్రకటన కారణంగా న్యూయార్క్ (New York) నగరం రణరంగంగా మారింది. తన అభిమానులకు బహుమతులు ఇస్తానన్న ప్రకటనతో వేలాది మంది తరలివచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
న్యూయార్క్ కు చెందిన 21 ఏళ్ల కై సెనాట్ (Kai Cenat) అనే యూట్యూబర్ కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో అతను తన ఇన్ స్టాగ్రామ్ పేజిలో ఓ పోస్ట్ పెట్టాడు. మన్ హటన్ యూనియన్ స్వ్కేర్ (Manhattan Union Square) పార్క్ లో శుక్రవారం సాయంత్రం లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ చేయనున్నట్లు అందులో పేర్కొన్నాడు. అంతేకాదు కార్యక్రమంలో అభిమానులను నేరుగా కలుస్తానని, వారికి ప్లే స్టేషన్ 5 గేమ్ కన్సోల్స్ సహా పలు బహుమతులు ఇస్తానని ప్రకటించారు. ఇది చూసిన అభిమానులు మన్ హటన్ పార్క్ కు వేలాదిగా తరలివచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు అభిమానులు అల్లర్లకు పాల్పడ్డారు. వీధుల్లో వాహనాలను అడ్డగించి, కార్ల అద్దాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు దిగారు. ఈ అల్లర్లలో పోలీసు అధికారులు సహా పలువురు గాయపడ్డారు. దీంతో కై సెనాట్ పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ది గార్డియన్ తెలిపింది. సెనాట్ పై అల్లర్లను ప్రేరేపించడం వంటి నేరారోపణలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
Also Read..
Corona | యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్..!
Tamannaah Bhatia | ఇప్పుడు బిజీగా ఉన్నా.. పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదంటున్న తమన్నా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

