Tamannaah Bhatia | ఇప్పుడు బిజీగా ఉన్నా.. పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదంటున్న తమన్నా
Tamannaah Bhatia అగ్ర కథానాయిక తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. దక్షిణాదితో పాటు హిందీలో కూడా ఈ భామకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు ‘భోళా శంకర్' ‘జైలర్' వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటించిన ‘భోళా శంకర్' ఈ నెల 11న విడుదలకానుంది.
Tamannaah Bhatia అగ్ర కథానాయిక తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. దక్షిణాదితో పాటు హిందీలో కూడా ఈ భామకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు ‘భోళా శంకర్’ ‘జైలర్’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటించిన ‘భోళా శంకర్’ ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం తమన్నా పాత్రికేయులతో ముచ్చటించింది. ఆమె చెప్పిన సంగతులివి..
నేను నటించిన ‘భోళా శంకర్’ ‘జైలర్’ చిత్రాలు ఒక్కరోజు వ్యవధిలో విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన సందర్భం. ఇద్దరు సూపర్‌స్టార్స్ సినిమాల్లో నేను భాగం కావడంతో నా కల నిజమైంది. ‘భోళా శంకర్’ తమిళ ‘వేదాళం’కు రీమేక్. అయితే తమిళ సినిమా వచ్చి చాలా రోజులైంది. దాంతో నేటి ట్రెండ్‌కు తగ్గట్లు తెలుగు వెర్షన్లో మార్పులు చేశారు. నా పాత్రను కూడా కొత్తగా తీర్చిదిద్దారు. ఇక ‘జైలర్’లో పూర్తి విభిన్నమైన పాత్రలో కనిపిస్తా.
అదే విజయరహస్యం
‘సైరా’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించాను. కానీ ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం మాత్రం రాలేదు. ‘భోళా శంకర్’తో ఆ లోటు తీరింది. చిరంజీవితో స్టెప్పులేయడం ఎప్పుడూ థ్రిల్లింగ్‌గానే ఉంటుంది. ‘మిల్కీ బ్యూటీ’ అనే రొమాంటిక్ పాటలో మంచి నృత్యాలుంటాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ వంటి టాలెంటెడ్ హీరోయిన్‌తో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. హీరోయిన్గా 18 ఏళ్లుగా రాణిస్తున్నా. నేను సినిమాను అమితంగా ప్రేమిస్తాను. ఎంతమంది నాయికలు వచ్చినా వారిని పోటీగా భావించను. పరిశ్రమలో ఇన్నేళ్లు నిలదొక్కుకోవడానికి సినిమా పట్ల నా అంకితభావం, క్రమశిక్షణే కారణం అనుకుంటున్నా. ప్రస్తుతం కెరీర్లో చాలా బిజీగా ఉన్నా. పెళ్లి గురించి ఆలోచించే తీరికలేదు. ఒకవేళ పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

